సీఎం వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుంది: కిశోర్ చంద్రదేవ్
కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాష్ట్ర వ్యవహారాలపై మాట్లాడారు. విభజన అంశంపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. ఇక, వరద బాధితులను పరామర్శించేందుకు రేపు రాష్ట్రానికి ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ రానున్నారని ఆయన వెల్లడించారు. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందుతుందని చంద్రదేవ్ స్పష్టం చేశారు.